Header Banner

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు! ఒకేరోజు ఐదుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం!

  Thu Mar 06, 2025 10:07        India

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర విషాదాన్ని నింపాయి. విశాఖపట్నం కంచరపాలెంలో జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే న్యూ కాలనీ నుండి కంచరపాలెం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు! 37 మంది దుర్మరణం..

 

ఇక ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై మరో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #RoadAccident #BreakingNews #Shocking #Visakhapatnam #EluruAccident #HighwayCrash #TragicIncident #LiveUpdates #StaySafe